ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఇన్చార్జ్ పురాణం సతీష్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి
ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఇన్చార్జ్ పురాణం సతీష్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి
భైంసా రూరల్ నవంబర్ 02
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పార్డి బైపాస్ రోడ్డు మార్గంలో రేపు నిర్వహించే భారీ బహిరంగ సభకు సర్వ సిద్ధమైంది. బీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఇట్టి బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్ఎస్ ముధోల్ ఇంచార్జి పురాణం సతీష్, ముధోల్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డిగారి విఠల్ రెడ్డితో పాటు పార్టీ శ్రేణులు సభ ప్రాంగణంతో పాటు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రేపు జరగబోయే కేసీఆర్ సభకు సుమారు 60 వేల నుండి 70 వేల వరకు జన సమీకరణ చేయనున్నట్లు తెలిపారు. గెలుపే ముధోల్ గడ్డపై ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క కార్యకర్త బహిరంగ సభకు హాజరై ప్రసంగించారు విజయవంతం కోరారు.