Thursday, 5 November 2026

ప్రజా యుద్ధనౌక గద్దర్ సంస్మరణ సభను విజయవంతం చేయండి-బహుజన నాయకులు రాగుల రాములు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 16.,(జనంసాక్షి). ప్రజా గాయకుడు కవి ప్రజా యుద్ధ నౌకగద్దర్ సంస్మరణ సభను విజయవంతం చేయాల్సిందిగా బహుజన నాయకులు రాగుల రాములు కోరారు. బుధవారం గద్దర్ సంస్మరణ సభ కరపత్రాలను స్మారక సభ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాగుల రాములు, బోల్లి రామ్మోహన్ పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం కాలికి గజ్జ కట్టుకొని గద్దర్ చైతన్యవంతం చేశాడని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందు వరుసలో ఉండి ప్రజలను చైతన్యవంతం చేసిన గద్దర్ ను స్మరించుకోవడం కోసం ఈ నెల 21వ తేదీన సిరిసిల్ల పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో జరిగే గద్దర్ సంస్మరణ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావాలని కోరారు. సభకు ప్రొఫెసర్ కోదండరాం తో పాటు అరుణోదయ సాంస్కృతిక సమైక్య చైర్మన్ విమలక్క తో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతున్నట్లు తెలిపారు. సమావేశంలో సిరిగిరి రమేష్, కంసాల మల్లేశం, చేన్నమనేని పురుషోత్తం రావు కానాపురం లక్ష్మణ్,,బోజ్జ కనకయ్య. తదితరులు పాల్గొన్నారు.