Thursday, 5 November 2026

ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టాలి…

– కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి.
ఊరుకొండ, ఆగస్టు 14 (జనం సాక్షి):
ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టాల్సిన సమయం ఆసన్నమైందని … ప్రజలు సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఊరుకొండ మండల అధ్యక్షుడు కుడుముల తిరుపతిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కాంగ్రెస్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవం సందర్భంగా జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావి గడ్డ నుండీ అంబేద్కర్ చౌరస్తా వరకు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిర్వహించిన పాదయాత్రలో ఊరుకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుడుముల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారని తెలిపారు. ప్రజా పోరాటంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గద్దె దింపవచ్చునని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలే… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పతనానికి ప్రధాన ఎజెండాగా ప్రజలు మార్చబోతున్నారని దుయ్యబట్టారు. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అనే చందంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత పాలన కొనసాగిస్తూ ప్రజల ఓర్పును నశించేలా చేశారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఓటమి తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుడుముల తిరుపతిరెడ్డి, కిసాన్ మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్, ఊరుకొండ టౌన్ ప్రెసిడెంట్ ఆరిఫ్, ఉర్కొండ మండల సేవాదళ్ అధ్యక్షులు పోలే గణేష్, కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నాయకులు దయాకర్, తదితరులు పాల్గొన్నారు.