ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగురవేయాలి

టిఆర్ఎస్ మండల మహిళ విభాగం అధ్యక్షురాలు అరుణ

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 14 (జనంసాక్షి) ఆత్మకూర్ మండల టిఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి తన నివాసం పై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది 75 వజ్రోత్సవాలు సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకోవాలని అన్నారు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని తెలిపారు