ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాటం జరపాలి
మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్21(జనంసాక్షి)
గ్రామ గ్రామాన ప్రజాసమస్యలపై అనునిత్యం బీజేపీ మండల నాయకులు పోరాటం జరపాలని బీజేపీ గార్ల మండల అధ్యక్షులు ఠాకూర్ జశ్వంత్ ప్రసాద్ అన్నారు. బుధవారం గార్ల మండల కేంద్రంలో మండల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మండల నాయకులను భూత్ ల ఇంచార్జ్లుగా నియమించి భూత్ స్థాయినుండి సమస్యలను సేకరించి వాటి పరిష్కారాలకు పోరాటం జరపాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై చేస్తున్న అరాచకలను ఎండగట్టి బీజేపీ రాష్టానికే అందిస్తున్న పధకాలను ప్రతి పథకానికి ఖర్చు చేస్తున్న ధనాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లి ప్రజాభివృద్ది కి కృషిచేయాలని జశ్వంత్ సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధానకార్యదర్శి రావూరి నాగేంద్రబాబు, వెంగలి బుచ్చిబాబు, ఎడ్ల రాజశేఖర్, వడ్డేపల్లి మహేష్, గంజి శ్రీను, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.