Thursday, 5 November 2026

ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడానికి ప్రజావాణి కార్యక్రమంప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడానికి ప్రజావాణి కార్యక్రమంజిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్

వికారాబాద్ రూరల్ జూన్ 12 జనం సాక్షి ప్రజా సమస్యల సత్వరపరిష్కారంకోసమేప్రజావాణికార్యక్రమంనిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్ తెలిపారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, జిల్లా పంచాయతీరాజ్ అధికారి తరుణ్ కుమార్ లతో కలసి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 113 ధరఖాస్తులను అయన స్వీకరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వస్తున్న ప్రతి ఒక్కరి దరఖాస్తుపై సంబంధిత శాఖల అధికారులు సత్వరం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు.