ఎల్బీ నగర్ (జనం సాక్షి )ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటానని బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ పేర్కొన్నారు. బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్ గ్రామంలో క్రాంతి యువజన సంఘం కమ్యూనిటీ హాల్ వద్ద, గాయత్రి బ్యాంక్ కాలనీ లోని భూగర్భ డ్రైనేజీ సమస్య గూర్చి తమ దృష్టికి వచ్చిన వెంటనే స్పందించిన లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కారానికై హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి సాహెబ్ నగర్ జనరల్ మేనేజర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. త్వరితగతిన ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.సానుకూలంగా స్పందించిన జనరల్ మేనేజర్ తక్షణమే భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని తమ సిబ్బందిని ఆదేశించారు..
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటా : బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న




