మిర్యాలగూడ. జనం సాక్షి…. విద్యార్థుల ఉపాధే విజయ లక్ష్యంగా విద్యనందిస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎకైక డిగ్రీ కళాశాల విజేత అని కళాశాల ప్రిన్సిపాల్ తెడ్ల ధనుంజయ అన్నారు.సోమవారం మిర్యాలగూడ పట్టణంలో టాస్క్ మరియు విజేత డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోసం జాబ్ మేళా నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ విద్యాలయాలు జ్ఞాన బోధన కే పరిమితం కాకుండా ఉపాధిని కల్పించే శాస్త్ర సాంకేతిక పరిశోధన కు నిలయాలు కావాలి.పెరుగుతున్న పోటీ ప్రపంచంలో విద్యార్థులు తట్టుకునే సామర్థ్యాలకు అణుగుణంగా తయారు చెయ్యడమే తమ విద్యాసంస్థల లక్ష్యమని అన్నారు.అనేక రకాల కంపెనీలు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోసం తమ విద్యాసంస్థలను ఎంపిక చేయడం అంటే ఇక్కడ నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యార్థులు ఉంటారనే నమ్మకం తమ విజేత విద్యాసంస్థలు పై ఉంచడం గర్వకారణం.ఈ రోజు జరిగిన జాబ్ మేళాలో నిరుద్యోగ యువత రెట్టింపు సంఖ్యలో 300 పైగా హాజరయ్యారని తెలిపారు.
విద్యార్థుల ఉపాదే లక్ష్యం – తెడ్ల ధనుంజయ




