ప్రణాళికాబద్ధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను నిర్వహించాలి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
    స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను జిల్లాలలో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణ పై హైదరాబాద్ నుండి  అన్ని జిల్లాల కలెక్టర్లలతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వజ్రోత్సవ వేడుకలు నిర్వహించే కార్యక్రమాలకు జిల్లా స్థాయిలో కలెక్టర్లు పక్కా కార్యాచరణ సిద్దం చేసుకొవాలని సూచించారు.  ఆగస్టు 10న ప్రతి గ్రామం, మున్సిపాలిటీ పరిధిలో ఫ్రీడం పార్క్ కింద కనీసం 75 మొక్కలు నాటాలని  పేర్కొన్నారు.  ఆగస్టు 11న ప్రతి మండల కేంద్రంలో ఫ్రీడం రన్, ఆగస్టు 12న జాతీయ సమైక్యత కోసం రక్షాబంధన్ నిర్వహణ, ఆగస్టు 13న  ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీ లో   జాతీయ జెండా, ఫ్లకార్డులతో విద్యార్థులు, ఉద్యోగులతో ఫ్రీడం ర్యాలీ నిర్వహించాలని, అనంతరం బేలూన్ లను గాల్లోకి వదలాలని తెలిపారు.
ఆగస్టు 14న ప్రతి నియోజకవర్గంలో జానపద కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేయాలని, 119 బృందాలు సిద్దం చేసి సన్నద్ధంగా ఉండాలని  తెలిపారు.  ఆగస్టు 16న ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి సామూహికంగా జాతీయ గీతాలాపన చేయాలని సీఎస్ పేర్కొన్నారు.ఆగస్టు 17న ప్రతి నియోజకవర్గంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాలో ప్రతి గ్రామం పరిధిలో క్రీడా పోటీలు నిర్వహించాలని, ఆగస్టు 11,12 న గ్రామ స్థాయిలో, ఆగస్టు 13,14న మండల స్థాయిలో, ఆగస్టు 16,17న జిల్లా స్థాయి పోటీలు నిర్వహించాలని, ఆగస్టు 18న ఫ్రీడం కప్  పోటిలు నిర్వహించి విజేతలను నిర్ణయించాలని తెలిపారు. ఆగస్టు 19న జిల్లాలో ఉన్న ప్రతి వృద్ధాశ్రమం,   ఆసుపత్రి, అనాథ శరణాలయంలో స్వీట్, పండ్లు పంపిణీ జరగాలని, ఆగస్టు 20న రంగోలి పోటీలు, ఆగస్టు 21న గ్రామ పంచాయతీ, మండల, జడ్పీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు సంబంధిత సమాచారంతో నివేదికలు పంపాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,ఎస్.పి. రె మా రాజేశ్వరి,డి.అర్ డి. ఓ కాలింధిని,డి పి ఓ విష్ణువర్ధన్,జడ్ పి సి ఈ ఓ.ప్రేమ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు