Tuesday, 3 November 2026

ప్రణాళిక ప్రకారం కాలనీల అభివృద్ధి – సర్పంచ్ గడ్డ మీది మల్లేష్ 

కాలనీల అభివృద్ధ్యే  గ్రామా భివృద్ధి – తెరాస అధ్యక్షుడు రెడ్డి శెట్టి శ్రీనివాస్
జవహర్ నగర్, అక్టోబర్ 20( జనం సాక్షి): జవహర్ నగర్ గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రతి కాలనీలోని సమస్యలను గుర్తించి, శాశ్వత    ప్రాతిపదికన ప్రణాళికలు చేస్తూ పాలక వర్గం ముందుకు సాగుతోందని సర్పంచ్ గడ్డ మీది మల్లేష్, ఉప సర్పంచ్ తెరాస అధ్యక్షుడు రెడ్డి శెట్టి శ్రీనివాస్ లు స్పష్టం చేసారు. శుక్ర వారం గ్రామంలోని రెండో వార్డ్ పాత బస్తీలో సీ సీ రోడ్డు పనులను స్థానిక వార్డ్ సభ్యుడు కందుల కృష్ణతో కలిసి వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ..దశల వారిగా అన్నీ కాలనీల్లో ఉన్న సమస్యలపై దృష్టి సారించి పరిష్కరిస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ నిధులను గ్రామాభివృధ్దికి ఉపయోగిస్తూన్నామని పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో మరిన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ  కార్యక్రమంలో వార్డ్ సభ్యులు కారింగుల వెంకటేష్ గౌడ్, వనిత, తెరాస నాయకులు కారింగుల రాజు గౌడ్, సాదీక్, కృష్ణా రెడ్డి, స్థానిక నాయకుడు చుక్క ఐలయ్య కాలనీ వాసులు పాల్గొన్నారు.