పారాదీప్ సవిూపంలో తీరం దాటిన వాయుగుండం
విశాఖపట్నం,అక్టోబర్20(జనంసాక్షి ): వాయివ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఒడిశాలోని పారాదీప్ సవిూపంలో తీరం దాటింది. వాయుగుండం ప్రభావంతో ఒడిశాలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటే ముందు ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 30 కిలోవిూటర్ల వేగంతో వాయుగుండం కదిలింది. ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ నైరుతి దిశగా 40 కిలోవిూటర్ల దూరంలో కేంద్రీకృతమై పారాదీప్‌కు సవిూపంగా తీరంగా దాటింది. వాయుగుండం తీరం దాటడంతో కోస్తా ప్రజలకు ఉపశమనం లభించింది. గత రెండు రోజులుగా భయపెడుతున్న వాయుగుండం ముప్పు తప్పింది. అయితే అల్పపీడనం గంటకు 30కిలోవిూటర్ల వేగంతో కదులుతూ వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. పారాదీప్‌కు 40 కిలోవిూటర్లు, చాంద్‌బలికి 90 కి.విూ దూరంలో కేంద్రీకృతం అయింది. వాయుగుండం
ప్రభావంతో ఉత్తర కోస్తాలో చెదురుమదురు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా తీరం వెంబడి గంటకు 45-50 కి.విూ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్సకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ అధికారులు హెచ్చరించారు. కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఇప్పటికే ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.