హైదరాబాద్,మార్చి9(జనంసాక్షి): సభా నియమాలు తెలుసుకుని ప్రతిపక్షం బాధ్యతగా పనిచేయాలని తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరావు అన్నారు. అసెంబ్లీ విూడియా పాయింట్ వద్ద ఉమ మాట్లాడుతూ… వైకాపా సభలో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వాయిదా తీర్మానంపై సభాపతికి సర్వాధికారాలు ఉంటాయని, వైకాపా అనవసర రాద్దాంతం చేస్తోందన్నారు. సభా నిర్వహణకు అవాంతరాలు సృష్టించి, విలువైన సభా సమయాన్ని వృథా చేయడం తగదన్నారు.




