Tuesday, 3 November 2026

ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి

– కేవలం ప్రభుత్వం వల్లనే ఉద్యోగాలు కల్పన సాధ్యం కాదు
– చిన్న, మధ్యతరహా పరిశ్రల ఏర్పాటు ద్వారా యువతకు అవకాశాలు కల్పించాలి
– ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
– ‘అకుర కేంద్రాలు – గ్రావిూణ ఆవిష్కర్తల సదస్సు’ను ప్రారంభించిన వెంకయ్య
హైదరాబాద్‌, ఆగస్టు30(జ‌నం సాక్షి) : దేశంలో గ్రావిూణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ జాతీయ గ్రావిూణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ సంస్థ – ఎన్‌ఐఆర్డీపీఆర్‌ ప్రాంగణంలో జరిగిన ‘అంకుర కేంద్రాలు – గావిూణ ఆవిష్కర్తల సదస్సు – 2018’ను గురువారం ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. రెండు రోజులపాటు జరగనున్న సదస్సులో కేంద్ర గ్రావిూణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి రాంకృపాల్‌ యాదవ్‌, తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, ఎంపీ విశ్వేశ్వర రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ సలహాదారు డాక్టర్‌ జి.సతీష్‌ రెడ్డి, ఎన్‌ఐఆర్డీపీఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ డబ్ల్యూఆర్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. మేక్‌ ఇన్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, క్లీన్‌ ఇండియా, జన్‌ ధన్‌ యోజన లాంటి కార్యక్రమాలు గ్రావిూణ వికాసానికి ఇతోధికంగా
దోహదపడుతున్నాయని, ఆ ఫలితాలు సవిూప భవిష్యత్తులో కనిపిస్తాయని స్పష్టం చేశారు. గ్రావిూణ భారతావని అభివృద్ధిలో ప్రాధాన్యత వారీగా నీటిపారుదల, మౌలిక సదుపాయాల కల్పన, వడ్డీ రేట్ల తగ్గింపు, రైతుబీమా, నూతన ఆవిష్కరణలు వంటి అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా ఎక్కువ నిధుల కేటాయింపులు చేయాలని సూచించారు. దేశంలో తెలంగాణ, ఆంధప్రదేశ్‌సహా 23 రాష్ట్రాల నుంచి హాజరైన గ్రావిూణ ఆవిష్కర్తలు, నిపుణులు, పరిశోధకులు, విద్యార్థులు ఈ సదసస్సుకు హాజరయ్యారు. దేశంలో గ్రావిూణ ఆవిష్కరణలు ఆర్థికాభివృద్ధిపై అత్యంత ప్రభావం చూపుతున్న దృష్ట్యా కేంద్ర, రాష్టాల్రు పెద్ద ఎత్తున యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌… ఇస్రో, డీఆర్‌డీఓ వంటి సంస్థల సహకారం తీసుకుని గ్రావిూణాభివృద్ధి, అంకుర కేంద్రాల ప్రోత్సాహానికి విశేషంగా కృషి చేయాలని అన్నారు. ఉద్యోగాల కల్పన ఒక్క ప్రభుత్వంవల్లే సాధ్యంకాదని, అంకుర కేంద్రాలు, చిన్నతరహా పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని పేర్కొన్నారు.