Thursday, 5 November 2026

ప్రతి ఒక్కరూ మట్టి గణపతి ని పూజించాలి

నాచారం(జనంసాక్షి):   పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించాలని కార్పొరేటర్ తెలియజేశారు. నాచారం హెచ్ఎంటి నగర్ వద్ద  శనివారం జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ ని కార్పొరేటర్ ప్రారంభించారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సాయి జెన్ శేఖర్, ముత్యం రెడ్డి, చంద్రశేఖర్, కట్టబుచ్చన్న గౌడ్ ,రామకృష్ణ, రెబల్ రాజు, తిరుపతి , దాసరి కర్ణ, వాసు ,తిరుమల్, జయరాజ్ ,జవాన్ కృష్ణ ,ఎస్ఎఫ్ఏలు యాకస్వామి, శ్యామల తదితరులు పాల్గొన్నారు.