Thursday, 5 November 2026

ప్రభుత్వ పాఠశాల ల ను అభివృద్ధి చేసుకోవాలి.-

సర్పంచ్ -బూర్గుల సరోజన

తొర్రూర్ 27 ఆగస్టు (జనంసాక్షి )
 పార్టీలకతీతంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసుకోవాలని గ్రామ సర్పంచ్ బూర్గుల  సరోజన- వెంకన్న అన్నారు. స్థానిక మండల కేంద్రంలోని చికటాయపాలెం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో ప్రధానోపాధ్యాయులు ఎండీ రహమాన్ అధ్యక్షతన సమావేశం లో సర్పంచ్ బూర్గుల సరోజన -వెంకన్న పాల్గోని మాట్లాడుతు  పాఠశాలలో నెలకొన్న సమస్య లనీ వెంటనే పరిస్కారిస్తాము అని అన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు. ఉపాధ్యాయలు శ్రద్ధ తీసుకోవాలని  అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు భూపతి వీరన్న, దుండి వీరన్న, పంచాయతీ కార్యదర్శి.  జీడికంటియాకాంత-వెంకన్న, ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు ఆశా వర్కర్లు అంగన్వాడి టీచర్లు  తదితరులు పాల్గొన్నారు.