బచ్చన్నపేట (జనం సాక్షి) మార్చి 15:
భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని బిజెపి జనగామ జిల్లా ఉపాధ్యక్షులు బేజడి బీరప్ప అన్నారు . బుధవారము మండలంలోని సాల్వపూపుర్ గ్రామం లో భూత్ స్వసక్తీకరణ అభియాన్.. గ్రామ కార్యకర్తలతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త బూత్ స్థాయిలో పార్టీ విజయం కోసం కష్టపడి పని చేస్తేనే జనగామ గడ్డ పై కమలం పువ్వు జండా ఎగరడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికి అర్థమయ్యేలా చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి 2023 శాసనసభ ఎలక్షన్లలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి భారతీయ జనతా పార్టీ 70 సీట్లతో రావడానికి ప్రతి కార్యకర్త ఈ సంవత్సర కాలం పాటు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు 2024లో రాబోయే పార్లమెంటు ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 400 సీట్లను నిలపడానికి ప్రతి కార్యకర్త ముందడుగు వేయాలని దిశ నిర్దేశం చేయడం జరిగిందని తెలిపారు . ఈ
కార్యక్రమంలో మండల అధ్యక్షులు సద్ది సోమిరెడ్డి, జిల్లా కార్మిక సభ్యులు గీస సందీప్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి గద్ద రాజు, మాజీ సర్పంచ్ సింగరయ్య గౌడ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి గద్ద రాజు భూత్ అధ్యక్షులు చిర్ల మల్లేశం, సీనియర్ నాయకుడు కనకయ్య, తిరుపతి,రాజు, చారి,మహేష్,రవి తదితరులు పాల్గొన్నారు.
ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లా పని చేయాలి…. బెజడి బీరప్ప




