Thursday, 5 November 2026

ప్రతి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కృషి చేస్తాం కార్పొరేటర్

అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 21

అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారండివిజన్ లోని  పలు కాలనీలలో జరుగుతున్న అభివృద్ధి పనులను కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ అధికారుల తో కలిసి రోడ్లను పరిశీలించారు. రుక్మిణి ఎన్క్లేవ్ లో గల స్మశాన వాటిక లో మౌలిక వసతులు కల్పిస్తానని  విజయ్ విహార్ కాలనీ రోడ్డు పనులను డ్రైనేజీ పనులను సమీపించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లోని ప్రతి కాలనీలో డ్రైనేజీ వ్యవస్థలు మెరుగుపరుస్తాం సిసి రోడ్లు మంచినీటి సమస్యలు శానిటేషన్ స్ట్రీట్ లైట్ వివిధ మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహాయ సహకారాలతో మన డివిజన్ ను ఆగ్రామీగా అభివృద్ధి దిశకు పయనించే విధంగా కృషి చేస్తామని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులుబొబ్బిలి సురేందర్ రెడ్డి, పుట్నాలకృష్ణ, అశోక్ కుమార్, శ్రావణ్ ముదిరాజ్, శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, శోభన్ బాబు, ఆంజనేయులు, శ్యామ్ కుమార్, హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.