Wednesday, 4 November 2026

ప్రతి కాలనీ ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం కార్పొరేటర్

అల్వాల్ (జనంసాక్షి) జూలై 29
డివిజన్లోని ప్రతి కాలనీ అభివృద్ధి ద్వేయంగా ముందుకు సాగుతున్నామని కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ అన్నారు. అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ చిత్తారయ్య కాలనీవాసులు వివిధ సమస్యల మీద కార్పొరేటర్ కు వినత పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు కాలనీలో వివిధ సమస్యల మీద పాదయాత్ర నిర్వహించడం జరిగింది.నూతనపార్కు నిర్మాణ దశలో ఉందని త్వరలో పనులు పూర్తయిన వెంటనే కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. డివిజన్లోని ప్రతి కాలనీలో డ్రైనేజీలు సిసి రోడ్లు వీధి స్తంభాలు శానిటేషన్ మంచినీటి సౌకర్యం వివిధ మౌలిక వసతులు కల్పించే విధంగా కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ఏఈ అరుణ్, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు, స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు కృష్ణారావు, భాస్కరరావు, అనంతుల సంతోష్, ప్రభాకర్, కుట్టి, మల్లేష్, షేక్, స్వప్న, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
 
Attachments area