ప్రతి కురుమ సోదరునికి అండగా ఉంటా
జిల్లా అధ్యక్షుడు కురుమ సాయిబాబాఎల్లారెడ్డి 26 మార్చ్ (జనం సాక్షి) ఇటీవల జిల్లా కురుమ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎల్లారెడ్డి వాసి కురుమ సాయిబాబా ను జిల్లా కురుమలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆదివారం ఆయన ఒక ప్రకటనలు తెలిపారు ఆయన మాట్లాడుతూ జిల్లా కురుమలు కొన్ని సంవత్సరాలుగా వెనుకబడినట్లు వారిని ముందుకు నడిపించడానికి అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు కురుమ జిల్లా అధ్యక్షుడిగా తన బాధ్యతను నెరవేరుస్తానని ఆయన అన్నారు అనుక్షణం వారికి అండగా ఉంటానని వారి సమస్యలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేసి పరిష్కరించేందుకు మార్గాలను అన్వేషిస్తా అని ఆయన అన్నారు జిల్లా కురుమ సోదరులు వారికి సమస్యలు ఉన్న తనకు తెలియజేయాలని తన వంతుగా ముందుండి పోరాడుతానని తెలిపారు
ప్రతి కురుమ సోదరునికి అండగా ఉంటా




