కామారెడ్డి ప్రతినిధి మార్చి12 జనంసాక్షి;
ప్రతి పక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాల పైననే ఈడి నోటీసులని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అర్ అండ్ బి అతిధి గృహంలో విలేకరుల సమావేశంలొ రాష్ట్ర శాసన సభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.ఇటీవల దేశంలో జరుగుతున్న సంఘటనలు మన దేశం ఇతర దేశాల ముందు తల వంచుకునే విధంగా ఉన్నాయని అన్నారు. రాముడు పాలించిన రామ రాజ్యం పతనమవుతున్నదని అన్నారు. దేశంలో రైతుల సమస్యలకు పరిష్కారం లేదని, ప్రధాని కేవలం అదానికి మాత్రమే దేశ ప్రజలకు కాదని అన్నారు. మోడీ అంటే ఈడి, ఈడి అంటే మోడీ అన్నట్టు దేశంలో ఉందని అన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి దేశ పౌరుడిగా మాట్లాడుతున్నానని అన్నారు. ప్రతి పక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాల పైననే ఈడి నోటీసులు వస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని దేశ, విదేశాలకు తెలిసేలా చేసిన కవితక్కను 9 గంటలు ఈడి విచారణ జరపడం సరైనది కాదని అన్నారు. బండి సంజయ్ ఒక తల్లికి పుట్టి ఉంటే ఈ విధంగా మాట్లాడడని అన్నారు.ఈ రకంగా మాట్లాడడం మాతృ మూర్తిని అవమానించడమేనని అన్నారు. జాగ్రత్తగా ఉండండి అందరికీ చీము, నెత్తురు ఉన్నాయని అన్నారు. మా సైన్యం బయటకు వస్తే మీరు ఒక్క కార్నర్ మీటింగ్ జరపరని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీ బుద్దిన్ లు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి పక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాల పైననే ఈడి నోటీసులు.ప్రతి పక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాల పైననే ఈడి నోటీసులు.-కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అర్ అండ్ బి అతిధి గృహంలో విలేకరుల సమావేశంలొ రాష్ట్ర శాసన సభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి




