Wednesday, 4 November 2026

ప్రతి పక్షాల పై కుట్రలు పన్నుతున్న బీజేపీ డా.సత్యం శ్రీరంగం

* మోడీ కోసమే ఈ ఈడీ నోటీసులు, కక్ష సాధింపు చర్యలు
కూకట్ పల్లి (జనంసాక్షి జులై 21)
 కాంగ్రెస్ పార్టీ అఖిల భారత నాయకులు  సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కి ఈడీ నోటీసు ఇచ్చి వేదిస్తున్నందుకు నిరసనగా టీపీసీసీ ఆధ్వర్యంలో  రేవంత్ రెడ్డి  నాయకత్వంలో ఈడీ ఆఫీస్ ముట్టడి నిరసన ర్యాలీలో పాల్గొన్న టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ  సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేయడాన్ని ఖండిస్తున్నానని, ప్రతి భారతీయుడిగా ప్రభుత్వం జవాబుదారీ తనంగా ఉండాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చిన దార్శనికురాలిగా, దేశంలోని ప్రతి పేదవాడు కడుపునిండా తిండి తినేందుకు, చేతినిండా పని ఉండేందుకు జాతీయ ఉపాధి హామీ పథకం తెచ్చిన దీర్ఘదర్శిగా, ఈ దేశాన్ని ప్రధానిగా పరిపాలించే అవకాశాలు మూడసార్లు (1991, 2004, 2009) వచ్చినా పదవిని వదులకున్న త్యాగమూర్తి  సోనియా గాంధీ.
దేశ స్వాతంత్ర సంగ్రామంలో సొంత ఆస్తులను వదిలేసుకున్న నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులతో ఎన్డీఏ ప్రభుత్వం వేధిస్తోంది.
ప్రజాస్వామ్యబద్దంగా, రాజ్యంగం సూచించిన విధంగా  క్రమపద్దతిలో దేశనిర్మాణం చేసిన కాంగ్రెస్ పార్టీని, శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఏమీచేయలేక వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, నియంతలను తలపిస్తూ, అక్రమ కేసులతో మోదీ-ఏన్డీఏ ప్రభుత్వం వేధిస్తోందని, దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసిన తెలంగాణ దేవత  సోనియమ్మపై చేస్తున్న విష కుట్రను పార్టీలకతీతంగా, కులమతాలకతీతంగా ప్రతి తెలంగాణ బిడ్డ తిప్పి కొట్టాలని  పిలుపునిచ్చారు.
 
Attachments area