Monday, 2 November 2026

ప్రతి పేద కుటుంబానికి స్త్రీనిధి సేవలు అందాలి

ప్రతి పేద కుటుంబానికి స్త్రీనిధి ఆర్థిక సేవలు అందేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో స్త్రీ నిధిపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. రుణ వితరణతోపాటు బీమా సేవలు అందించే అంశాన్ని పరిశీలించాలన్నరు. స్త్రీనిధి సంస్థ ఆర్థిక సంస్థగానే కాకుండా సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్న సంస్థగా రూపొందించాలని కేటీఆర్ ఆకాంక్షించారు. వెనకబడిన దళిత కుటుంబాలకి స్వయం ఉపాధి పొందేలా ప్రణాళికలు వేయాలన్నరు. 2015-16 సంవత్సరానికి 1050 కోట్ల క్రిడిట్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు మంత్రి కేటీఆర్ కు స్త్రీ నిధి అధికారులు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *