Thursday, 5 November 2026

ప్రతి పేద కుటుంబ విద్యార్థులకుచేయూత-ముత్యాలి బాయి హమ్ము నాయక్ వెల్ఫేర్ సొసైటీ.

ప్రతి పేద కుటుంబ విద్యార్థులకుచేయూత-ముత్యాలి బాయి హమ్ము నాయక్ వెల్ఫేర్ సొసైటీ.
నేరడిగొండజనవరి14(జనంసాక్షి):పేద కుటుంబ సభ్యులకు పేద విద్యార్థులకు తమ వంతు సహాయం చేయాలని సంకల్పంతో ముందుకొచ్చిన మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన నూర్ సింగ్ అనే ఉపాధ్యాయుడు వారి తాత, జ్ఞాపాకర్థంగా సమాజ సేవకొరకై(ముత్యాలి బాయి- హమ్ము నాయక్) పేరట
వెల్పర్ సొసైటీని ఏర్పాటు చేశారు.ఇందులో భాగంగా గ్రామస్తుల ఆహ్వాన మేరకు ముఖ్య అతిథిగా బోథ్ కోర్టు న్యాయమూర్తి బి హుసేన్, ఐటీడీఏ ఈఈ భీంరావు హాజరై సొసైటీని ప్రారంబించి వారి చేతులమీదుగా అంతరాష్ట్రల నుంచి వలస వచ్చిన పలువురు కూలీ కుటుంబాలకు సంక్రాతి పండుగ సందర్బంగా నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు.ముందుగా విరికి గ్రామస్తులు శాలువతో సత్కరించారు.ఈ సందర్బంగా న్యాయమూర్తి మాట్లాడుతూ సామాజిక సేవ భావంతో గొప్ప మనసున్న సొసైటీ ద్వారా విద్యార్థులకు చదువు కోసం అవసరమైన సహాయ సహకారాలు అందించుటకు ముందుకు వచ్చిన సొసైటీ సబ్యులకు అభినందించారు. యువతను మంచి మార్గంలో నడిపించే విధంగా న్యాయపరమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ చదువుల విషయంలో ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా ఈ సొసైటీ పనిచేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇటీవల ఎంబిబిఎస్ సిటు సాధించిన ఉపాధ్యాయుడు విట్టల్ కూతురు మానస ను గ్రామస్తుల సమక్షంలో సన్మానించారు.మొదటిసారి గ్రామానికి విచ్చేసిన న్యాయమూర్తిని గ్రామస్తులంతా సన్మానం చేశారు,గ్రామ ఉద్యోగస్తుల సంఘల నాయకులు గ్రామ సర్పంచ్ సుజాత గోపీచంద్ సీడీఓ మోహన్ నాయక్ ఎఎస్సై మారుతి గ్రామ పెద్దలు గంగారాం నాయక్ కారోబారి రూప్ల నాయక్ డావో శ్రీరామ్ గ్రామస్తులు రాయులు, తుకారం పరశురాం గోపీచంద్ మురళీ కృష్ణ బాబులాల్ ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు.