ప్రతీ ఆడపిల్లకు సుకన్య సమృద్ధి ఖాతా ఉండాలి
అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన సదస్సు
మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్9(జనంసాక్షి)
10 సంవత్సరాల లోపు ప్రతి ఆడపిల్లకు పోస్ట్ ఆఫీసులో సుకన్య సమృద్ధి ఖాతా తప్పనిసరి ఉండాలని ఎస్పీఎం బి నాగరాజు అన్నారు. గురువారం గార్ల మండలంలోని పెద్దకిష్టపురం పోస్టాఫీస్ పరిధిలోని దేశ్యతండా, సర్వన్ తండా, మంగలితండాలలోని అంగన్వాడీ కేంద్రాలలో సుకన్య సమృద్ధి ఖాతాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతీ 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు సుకన్య సంవృద్ధి ఖాతా ఉండడం వల్ల సంవత్సరానికి చక్ర వడ్డీ రూపంలో 7.6% లబ్ది చేకూరుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు వారిపేరుమీద ఖాతా తెరవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎం బి నాగరాజు, ఎంఓ జి మల్లికార్జునరావు, పోస్ట్ మాస్టర్ జి ఉమా మహేశ్వర చారి, సిబ్బంది పాల్గొన్నారు.