Tuesday, 3 November 2026

ప్రత్యేకహోదా హావిూని విస్మరించిన జగన్‌

అనంతపురం,ఫిబ్రవరి24(జనం సాక్షి): కాంగ్రెస్‌ను ఎపి ప్రజలు ఆదరించాలంటూ.. పిసిసి అధ్యక్షులు సాకే శైలజానాధ్‌ కోరారు. ప్రత్యేకమోదా సాధిస్తామని హావిూ ఇచ్చిన వైఎస్‌ జగన్‌ ఆ విషయమే పట్టించుకోవడం లేదన్నారు. ఇది చాలా దారుణమన్నారు. కేంద్రాన్ని నిలదీయడంలో జగన్‌ ప్రభుత్వం పూర్తిగా
విఫలమయ్యిందన్నారు. కేవలం కాంగ్రెస మాత్రమే ఈ నిర్ణయం తీసుకోగలదన్నారు. కాంగ్రెస్‌ను ఆదరించాలంటూ.. ఎపి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. యువ భారత దేశానికి.. రాహుల్‌ గాంధీ సామర్ధ్యం ఉన్న నాయకుడని శైలజానాథ్‌ వ్యాఖ్యానించారు. దేశంలో అన్ని వర్గాలకు సంక్షేమం చేకూరాలంటే రాహుల్‌గాంధీ నేతృత్వంలోని యువ నాయకత్వం అవసరమని అన్నారు. దేశంలోని ప్రతి గుండె రాహుల్‌గాంధీనే శ్వాసగా ఎదురు చూస్తోందని పేర్కొన్నారు. ఏపీని దేశంలో అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో రాహుల్‌గాంధీ ముందుకెళ్తున్నారన్నారు.