Tuesday, 3 November 2026

ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారాఅవగాహన సదస్సు

ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారాఅవగాహన సదస్సు  :కార్పొరేటర్  అరుణ సురేందర్ యాదవ్ ,
ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా మహిళలకు వచ్చే  ఉపాధి  ఉన్నత మార్గాలను చేరుకోవడానికి అవగాహన సదస్సు  నిర్వహించిన అధికారులునారాయణరావు,కుమారస్వామి అవగాహన సదస్సు  నిర్వహించారు .    ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కార్పొరేటర్  అరుణ సురేందర్ యాదవ్ ,  పేరాల శేఖర్ రావు , దక్షిణ భారత అధ్యక్షులుఖాదీ , గ్రామీణ పరిశ్రమల కమీషన్  కార్పొరేటర్  మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం
గ్రామీణ , పట్టణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగుల ఉపాధి కల్పనకు భారత ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని తెలిపారు . .దేశంలోని వివిధ వర్గాల ప్రజల ఆశలు ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని, భారత ప్రభుత్వం ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకము (పి. ఎంఇ జి పీ) ను ప్రవేశపెట్టినది.18 సంవత్సరములు పైబడిన వ్యక్తులు, స్వయం సహాయ బృందాలు, సొసైటీ చట్టం 1860 క్రింద నమోదైన సంస్థలు, ఉత్పత్తి సహకార సంఘాలు మరియు ట్రస్ట్ లు పేఎంఇజీపే క్రింద ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి మాత్రమే ఆర్థిక సాయం పొందేందుకు అర్హులు. కుటుంబం అంటే దరఖాస్తుదారు ‘ వారి జీవిత భాగస్వామి. తయారీ రంగంలో రూ. 10.00 లక్షల పైబడిన ప్రాజెక్టుల కు  సేవా రంగంలో రూ.5.00 లక్షల పైబడిన ప్రాజెక్టులకు అభ్యర్థులు కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని .లాభార్జన, ఋణం తిరిగి చెల్లింపులో మంచి పనితీరు కనబరిచే పీఎంఇజీపీ / ముద్రా యూనిట్లు విస్తరణ కోసం తయారీ రంగంలో రూ.1.00 కోటి వరకు, సేవా రంగంలో రూ 25.00 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు అని అనారు . దీనికి సంబంధించి లబ్దిదారులు 10% తమ వాటాగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని . ప్రాజెక్టు వ్యయంపై 15% సబ్సిడీ అందజేయడం జరుగుతుంది ప్రతి ఒకరు ఈ పాతకి ఉపోయోగించు కోవాలి అని కోరారు