Tuesday, 3 November 2026

మాదక ద్రవ్యాల రవాణాపై ప్రీమియా అకాడమీ అవగాహన

ఖైరతాబాద్ : 14 జూలై (జనం సాక్షి) మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వల్ల కలిగే నష్టాల పట్ల అవగాహన కల్పించడం కోసం హైదరాబాద్‌లోని తమ క్యాంపస్‌లో  అవగాహన కార్యక్రమాన్ని ప్రీమియా అకాడమీ ప్రిన్సిపాల్‌ శ్రీమతి తృప్తి రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్య, పేరెంటింగ్‌, చిన్నారుల రక్షణకు సంబంధించి అత్యంత ఒత్తిడితో కూడుకున్న అంశాలను పరిష్కరించడమే నేపథధ్యంగా ప్రీమియా అకాడమీ ప్రారంభించిన ‘ఫస్ట్‌ వాయిస్‌ ఆఫ్‌ విజ్డమ్‌ ’కార్యక్రమం లో భాగంగా దీనిని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా మత్తుమందులు వినియోగం వల్ల శారీరక, మానసికంగా కలిగే ప్రభావాల పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా మాదక ద్రవ్యాల సంబంధిత మానవతా సంక్షోభం, ఆ మహమ్మారి అంతం కోసం తీసుకోవాల్సిన చర్యలను గురించి వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని సుప్రసిద్ధ చైల్డ్‌, అడోలెసెంట్‌ సైక్రియాట్రిస్ట్‌ డాక్టర్‌ కళ్యాణ్‌ చక్రవర్తి, మానసిక ఆరోగ్య ప్రచారకర్త, పేరెంటింగ్‌ కోచ్‌ భార్గవి రెడ్డిల భాగస్వామ్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైక్రియాట్రిస్ట్‌ డాక్టర్‌ కళ్యాణ్‌ చక్రవర్తి, పేరెంటింగ్‌ కోచ్‌ భార్గవి రెడ్డి పాల్గొని ప్రసంగించారు.