బ్రహీంపట్నం ఫిబ్రవరి 9( జనం సాక్షి )తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలకు నిరసనగా *టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా బుధవారం యాచారం మండల కేంద్రంలోని సాగర్ రహదారి పై రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేసిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్న నినాదంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేసిన బిజెపి నేడు తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ అవహేళనగా మాట్లాడడం తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పాశ్చా బాషా, నాయకులు రాజునాయక్, చిన్నొళ్ళ యాదయ్య, సత్యపాల్, మస్కు రమేశ్, కాజు మహ్మద్, జాని బాయ్, గ్రామల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై తెరాస శ్రేణుల నిరసన మోడీ దిష్టిబొమ్మ దగ్ధం




