Wednesday, 4 November 2026

ప్రధాన ప్రతిపక్షంగా అర్హతలేని టీడీపీ: ఆనం రామనారాయణరెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రధాన ప్రతిపక్షంగా ఉండటానికి టీడీపీకి అర్హత లేదని మంత్రి రామనారాయణరెడ్డి అన్నారు. సభాపతి స్థానాన్ని ప్రధాన ప్రతిపక్షం గౌవించడం లేదని విమర్శించారు. సమాధానాలు చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సభ జరగకపోవడానికి విపక్షాల రభసే కారణం అన్నారు. విపక్షాల వల్ల సభ వాయిదా పడుతుందని చెప్పారు. బీఎసీ ఎజెండా అమలు కాకపోవడం దురదృష్టకరం అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిపై సీపీఐ చేసిన వ్యాఖ్యలు సమంజసమైనవి కావని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *