Wednesday, 4 November 2026

ప్రపంచ రక్త దాతల దినోత్సవ సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రక్తదానం చేసిన జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుడ్ల దేవేందర్

ఏటూరునాగారం(జనంసాక్షి) జూన్14.ఈ రోజు ఏటూరునాగారం బ్లడ్ డోనార్స్ ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన శిబిరమునకు హాజరై రక్తదానం చేస్తున్నటువంటి వ్యక్తులకు “ప్రపంచ రక్తదాన దినోత్సవ” శుభాకాంక్షలు తెలియజేస్తూ అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ అందించిన మండల కాంగ్రెస్ నాయకులు అలాగే అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది, రక్తదానం చేయండి ప్రాణదాతలుగా నిలవండి అంటూ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులైనా గుడ్ల దేవేందర్ రక్తదానం చేస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు.ఈ కార్యక్రమంలో జిల్లా అసెంబ్లీ కోఆర్డినేటర్ ఇర్సవడ్ల వెంకన్న, మండల అధ్యక్షులు చిటమట రఘు, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ అయూబ్ ఖాన్, జిల్లా నాయకులు గుడ్ల దేవేందర్, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావిలాల నరసింహారావు, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎండి గౌస్, మాజీ పీఎసిఎస్ చైర్మన్ దేవులపల్లి విజయ్ కుమార్, వార్డు సభ్యులు పడిదల హనుమంత్,ఖయ్యుమ్,రఫిక్, ఎ. సతీష్ తదితరులు పాల్గొన్నారు.