ప్రభుత్వం రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలి
మంథని, (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 ఎన్నికల్లో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తానని రైతులకు హామీ ఇచ్చి కొంతమందికే చేశారని మంథని మండలం సిరిపురం గ్రామానికి చెందిన రైతులు బుద్దే సుధాకర్, డి. చంద్రమోహన్, వేణు, రమేష్, రాజేశం, లక్ష్మీనారాయణ, సతీష్ లు ఒక ప్రకటన పేర్కొన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకపోగా కటింగ్ పేరా 10 కిలోల వరకు తరుకుతీస్తూ రైతులను మోసం చేస్తూ నడ్డి విరుస్తున్నారన్నారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.