Tuesday, 3 November 2026

ప్రభుత్వం స్పందించకుంటే.. 

ఆమరణ దీక్ష చేస్తాం
– మొండి వైఖరితో తమని అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది
– రేషన్‌ డీలర్ల సంఘం నాయకుడు నాయకోటి
హైదరాబాద్‌, జూన్‌29(జనం సాక్షి) : న్యాయమైన తమ డిమాండ్ల పరిష్కారానికి ఆమరణ దీక్ష చేస్తామని రేషన్‌ డీలర్లు ప్రకటించారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సమ్మె విరమించేది లేదని రేషన్‌ డీలర్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం మొండి వైఖరితో తమని అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం డీలర్లకు రావాల్సిన రూ.600 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఇతర రాష్టాల్ల్రో మాదిరిగా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తే లారీలతో పాలు తెచ్చి సీఎం కేసీఆర్‌ ని అభిషేకిస్తామన్నారు. తమకు మద్దతుగా సమ్మెలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 5 లక్షల డీలర్లు సిద్ధంగా ఉన్నారని రేషన్‌ డీలర్ల సంఘం నాయకుడు నాయకోటి రాజు తెలిపారు. తమ వెనుక ఆలిండియా రేషన్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ తప్ప ఏ రాజకీయ పార్టీ లేదని స్పష్టం చేశారు. జూలై 5లోగా తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని చెప్పారు. ఎప్పుడు, ఎక్కడ చేపట్టేది జూలై 4న ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తామేవిూ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నామని అయినా రాష్ట్ర ప్రభుత్వం తమపై ఉక్కుపాదం మోపాలనిచూస్తుందన్నారు. తమ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి.. తమకు పోటీగా మహిళ సంఘాల ద్వారా రేషన్‌ను పంపిణీచేయాలని చూస్తుందని ఇలాంటి చర్యలకు పూనుకోవటం సరికాదని వారు ప్రభుత్వాన్ని కోరారు.