రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగి కాలిబుడిదైనవి.
మండలంలోని కుఫ్టీ గ్రామ సమీపంలోని 44నంబర్ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు డీ కొన్న సంఘటనలో మంటలు చెలరేగి వాహనాలు కాలి బుడిదయ్యాయి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది సమాచారం అందుకున్న పోలీసులు ఎస్సై మాహేందర్ సహాయక చర్యలు చేపట్టారు.స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ పంజాబ్ రాష్ట్రాలకు చెందిన రెండు లారీలు ఆదిలాబాద్ వైపు నుండి హైదరాబాద్ వెల్లె క్రమంలో కుఫ్టీ బ్రిడ్జి వద్ద అతివేగంగా వెనుక నుంచి మరొకటి డీ కొనడం వల్ల ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయని దాంతో రెండు వాహనాలు కాలి బుడిదయ్యాయి.అందులో ఉన్న డ్రైవర్ క్లినర్లు ప్రాణాలతో బయటపడ్డారు.గంట పాటు వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. పోలీసుల తోపాటు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందగానే వచ్చి మంటలు ఆర్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాహేందర్ తెలిపారు.