Tuesday, 3 November 2026

ప్రభుత్వ ఉద్యోగులకు ఒక విడత డిఎ

ఎంపిడివోలకు పదోన్నతులకు ఆమోదం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీపి కబురు అందించారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక విడత డీఏ కరువు భత్యం చెల్లించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 1.572 శాతం డీఏ చెల్లించాలనే ఉత్తర్వులపై కేసీఆర్‌ ఇవాళ సంతకం చేశారు. ఈ పెంపుతో 27.24 శాతానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ చేరుకుంది. సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డీఎ పెంపుపై ఉద్యోగులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఎంపిడివోల పదోన్నతులకు సిఎం ఆమోదం

తెలంగాణలో ఎంపీడీఓల ఏళ్లనాటి కల ఫలించింది. 21 ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న ఎంపీడీఓలకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎంపీడీఓల పదోన్నతుల ్గ/లుపై సీఎం కేసీఆర్‌ సోమవారం సంతకం చేశారు. దీంతో మండల వ్యవస్థ ఏర్పాటైన తర్వాత తొలిసారి ఎంపీడీఓలకు పదోన్నతులు దక్కనున్నాయి. సీఎం నిర్ణయంతో దాదాపు 130 మందికి పైగా ఎంపీడీఓలకు జెడ్పీ డిప్యూటీ సీఈఓ, సీఈఓ, డీఆర్డీఓ తదితర పోస్టులతో పాటు… హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి కమిషనర్‌, ్గ/నాన్స్‌ కమిషన్‌, ఈజీఎంయం తదితర కార్యాలయాల్లో అవకాశం దక్కనుంది. ఇప్పటికే గ్రామ కార్యదర్శులు, ఈఓ పీఆర్డీల పదోన్నతులను పూర్తి చేసిన పంచాయతీరాజ్‌ శాఖలో.. తాజాగా ఎంపీడీఓల పదోన్నతులు, కొత్తగా జూనియర్‌ కార్యదర్శుల నియామకంతో రానున్న రోజుల్లో గ్రామ పాలన కొత్త పుంతలు తొక్కడం ఖాయం అంటున్నారు. ఎన్నో ఏళ్లుగా పదోన్నతుల కోసం ప్రభుత్వాలతో

పోరాడుతున్నామని.. తమ ఏళ్ల నాటి ఆకాంక్షను నెరవేర్చిన సీఎం కేసీఆర్‌కు, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఎంపీడీఓల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్రరావు, అసోసియేట్‌ అధ్యక్షుడు శేషాద్రి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌లు కృతజ్ఞతలు తెలిపారు.