Tuesday, 3 November 2026

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వసతులు కల్పించాలి వైయస్సార్ తెలంగాణ పార్టీ సికింద్రాబాద్ కోఆర్డినేటర్ కే యస్ శిల్పాచారి

         సికింద్రాబాద్ తెలంగాణ  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ఏ ఒక్క సమస్యను కూడా తీర్చలేని ప్రభుత్వం ఉంటే ఎంత లేకపోతే ఎంత తెలంగాణలో బార్లు బీర్లకు ఉన్న విలువ విద్యకు లేదా గల్లి ఒక బారు రెస్టారెంట్లు పెడుతూ ప్రభుత్వం తరఫున తాగుబోతులను తయారు చేస్తూ తాగుబోతుల కావాల్సినటువంటి బార్లు బీర్లు అందుబాటులో పెడతారు కానీ విద్యావంతులు కావడానికి ఉపయోగపడే పుస్తకాలను మాత్రం ఇప్పటికీ కూడా ప్రభుత్వం విద్యార్థులకు అందించలేదు. స్కూల్లో ఉన్నటువంటి వసతుల విషయానికొస్తే టాయిలెట్లు లేక విద్యార్థులు గంటలు తరబడిన కూడా వాష్ రూమ్ కి వెళ్ళలేని పరిస్థితి ఉంది ఇప్పటికైనా అడ్డగుట్ట లోనే ఉన్నత పాఠశాలలో టాయిలెట్లు నిర్మించి  విద్యార్థిని విద్యార్థులకు ఇబ్బందులు తొలగించాలని  రాష్ట్ర  ప్రభుత్వాని డిమాండ్ చేశారు.  25 మంది టీచర్సు ఉండాల్సిన చోట కేవలం 15 మందితో విద్యను బోధించడం అనేది సాధ్యపడదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులను,  విద్యార్థులకు అదనపు గదులను, టాయిలెట్స్ ను పుస్తకాలను విద్యార్థులకు
సమకూర్చి విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.