ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు

రుద్రంగి అక్టోబర్ 1 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలో శనివారం ప్రభుత్వ కళాశాలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గంగయ్య మాట్లాడుతూ… మన తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా కళాశాల విద్యార్థినిలు,మహిళా లెక్చరర్స్ అందమైన
బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సంబరాలను నిర్వహించడం పట్ల కళాశాల విద్యార్థిని విద్యార్థులను మరియు లెక్చరర్స్ ను అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్స్ నవీన్ రెడ్డి,ఆఫ్రీన్, నిషాత్,రాజిరెడ్డి,రాజు,సుమన్,గోపి,సునీత,కృష్ణ మరియు ఆఫీస్ సిబ్బంది సాయి ప్రసాద్,సతీష్,తిరుపతి,గంగాధర్ లు పాల్గొన్నారు.