ప్రభుత్వ నిషేధిత గంజాయి పట్టివేత, ఇద్దరు యువకుల అరెస్ట్: ఎస్సై శ్రీధర్

హుస్నాబాద్ రూరల్ ఆగస్టు 07(జనంసాక్షి) హుస్నాబాద్ లోని అనబేరి విగ్రహం డిపో క్రాసింగ్ వద్ద శనివారం రాత్రి ఎస్సై శ్రీధర్ అధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా, కోహెడ నుండి హుస్నాబాద్ కు ప్రభుత్వ నిషేధిత గంజాయి ప్యాకెట్లను అమ్మడానికి తీసుకువస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి  నాలుగు ప్యాకెట్లలో సుమారు 48 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. ఇద్దరు యువకుల్లో ఒకరు బస్వాపూర్ కు చెందిన గణేష్, మరో యువకుడు హుస్నాబాద్ కు చెందిన వంశీ గా గుర్తించినట్లు వెల్లడించారు. ఇద్దరు యువకులు డబ్బులు సునాయాసంగా సంపాదించాలనే ఉద్దేశంతో, జల్సాలకు అలవాటు పడి తక్కువ ధరకు గంజాయి కోని, ఎక్కువ ధరకు అమ్మడానికి హుస్నాబాద్ తీసుకువస్తుండగా పట్టుబడినట్లు తెలిపారు.ఇద్దరు యువకుల పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ రఘుపతి వెల్లడించారు.