ఖైరతాబాద్ : ఆగస్టు 07 (జనం సాక్షి) ప్రపంచంలోనే మొట్ట మొదటి డ్రై క్యాప్ టెక్నాలజీ ఆధారిత క్రిమి సంహారక మందు జుడ్వా జి అని సల్ఫర్ మిల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బిమల్ షా తెలిపారు. సల్ఫర్ మిల్స్ లిమిటెడ్ తమ పేటెంట్ పొందిన క్రిమిసంహారక జుడ్వా జిని ఇటీవల తెలంగాణాలో విడుదల చేశామన్నారు. ఇందులోని క్రియాశీల పదార్థాలు సురక్షితంగా పాలిమర్ క్యాప్సూల్‌లో భద్రపరచబడ్డాయన్నారు. ఈ పదార్ధాలు మొక్కల ఆకులపై నిర్ణీత వ్యవధిలో చెదరగొట్టబడతాయన్నారు. తెగుళ్ళతో పోరాడటానికి మొక్కకు అవసరమైనప్పుడు వాటిని అందుబాటులో ఉంచుతాయన్నారు.
జుడ్వా జి బోర్ గొంగళి పురుగును సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. జుడ్వా జి ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ అన్నారు. కంపెనీ పేటెంట్ పొందిన డ్రై క్యాప్ టెక్నాలజీ రెండు అగ్రో కెమికల్స్ జాయింట్ డెలివరీని అనుమతిస్తుందన్నారు. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న జెనరిక్ లిక్విడ్ ఫార్ములేషన్‌లను సులభంగా భర్తీ చేయగలదని పేర్కొన్నారు.




