Thursday, 5 November 2026

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి…….

టేకుమట్ల.సెప్టెంబర్11(జనం సాక్షి)ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సమాచార పౌర సంబంధాల శాఖ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు టేకుమట్ల మండలం ఆశిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సీజనల్ వ్యాధులు హరితహారం ప్రభుత్వ పథకాలపై ఆటపాటలతో ప్రజలను చైతన్య పరచడం జరిగింది.ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆటపాట ద్వారా అవగాహన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎర్రన్న కళాబృందం సభ్యులు. కొండపర్తి స్వప్న,బండారి అనిత,ఏనుగుతల మౌనిక, వెన్నెల శ్రీనాథ్,మంకాల యాకూబ్,నెల్లుట్ల సుమన్, పడిదం రాజేందర్,ఎండి ఖలీల్ పాషా,బిరు మహేందర్, కందగట్ల విజయ్ తదితరులు పాల్గొన్నారు.