ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు తప్పవు – రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్ గౌడ్.
*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి)* : ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని రాజేంద్రనగర్ తాసిల్దార్ చంద్రశేఖర్ గౌడ్ హెచ్చరించారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమవతిపేట లోని సర్వే నెంబర్ 378 లోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేశారని ఫిర్యాదు రావడంతో బుధవారం రెవెన్యూ సిబ్బందితో కలిసి అక్రమంగా నిర్మించిన 4 రూములు,2 బాత్ రూములు, 6 బేస్ మెంట్లు అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని జెసిబిల సహాయంతో కూల్చివేసిన రెవెన్యూ అధికారులు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని కూల్చివేతలు తప్పవన్నారు. కూల్చివేసిన ప్రాంతాల్లో మరోసారి నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు చేపడితే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఫోటో రైటప్ : ప్రేమవతిపేటలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న రెవెన్యూ అధికారులు.