ముస్తాబాద్ జులై 21 జనం సాక్షి
ముస్తాబాద్ మండలానికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన తాహసిల్దార్ గారిని భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మానించడం జరిగింది, అలాగే ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన ప్రభుత్వ భూములను 2014 నుండి 2022 సంవత్సరాల వరకు ఎవరెవరికి కేటాయించారో వారి పూర్తి వివరాలను తెలుపగలరని సమాచార హక్కు చట్టం పత్రం గౌరవ తాసిల్దార్ కి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి కోల కృష్ణగౌడ్,జిల్లా అధికార ప్రతినిధి మల్లారం సంతోష్ రెడ్డి,ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు మెంగని మహేందర్, మండల ఉపాధ్యక్షులు ఆది శేఖర్, జనార్దన్,సాయి పాల్గొన్నారు
Attachments area




