Wednesday, 4 November 2026

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే ఐ.ఎ.పి.పనులు ఎంపికజిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌

కరీంనగర్‌, నవంబర్‌ 15 : ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో సమీకృత కార్యాచరణ అభివృద్ధి (ఐ.ఎ.పి.) పనులు ఎంపిక చేశామని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ, డి.ఎఫ్‌.ఓ.తో కలిసి పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మారుమూల, నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 2011-12న ఆర్థిక సంవత్సరానికి 30కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ, డిఎస్పీలతో జిల్లా స్థాయి కమిటీలో ప్రభుత్వ మార్గదర్శక సూత్రాల ప్రకారం మారు మూల నక్సల్‌ ప్రభావిత గిరిజన గ్రామాలలో గుర్తించిన పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. పార్లమెంటు సభ్యులు సూచించిన పనులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. రెండవ విడతగా ఐ.ఎ.పి నిధులతో కొంత మేరకు అభివృద్ధి చెందిన మండలాలో పనులు గుర్తించి మంజూరు చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. జిల్లా ఎసీప వి. రవీందర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసిన ఐ.ఎ.పి. నిధులతో మారు మూల నక్సెల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణ, తాగునీరు కల్పన విద్యాభివృద్ధి రోడ్ల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డివిజనల్‌ ఫారెస్టు అధికారి షఫియుల్లా, రిటైర్డు ఇంజనీర్‌ రాజేశ్వరరెడ్డి తదతరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *