ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు కృతజ్ఞతల వెల్లువ
రామకృష్ణాపూర్, (జనంసాక్షి): క్యాతన్ పల్లి మున్సిపాలిటీని రామకృష్ణాపూర్ మున్సిపాలిటీగా పేరు మార్పు గావించినందుకు ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పట్టణ తెరాస నేతలు బుధవారం అసెంబ్లీ ఆవరణలో మర్యాదపూర్వకంగా కలిసి, శాలువా తో ఘనంగా సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంధర్భంగా తెరాస పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎంతో కృషి చేసి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కి రామకృష్ణాపూర్ పట్టణ ప్రాముఖ్యత ను తెలియజేసి, బిల్లు సభలో ప్రవేశ పెట్టితీర్మానం చేపించడం వల్ల పట్టణ ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, రామిడి కుమార్, జాడి శ్రీనివాస్, గోపు రాజం మున్సిపాలిటీ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విధ్యాసాగర్ రెడ్డి, మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు రేవెల్లి ఓదేలు, జీలకర మహేష్, అలుగుల శ్రీలత సత్తయ్య, యువ నాయకులు కొక్కుల సతీష్, కొండ కుమార్ , గడ్డం రాజు , ఎర్రబెల్లి రాజేష్, బోద్దుల ప్రేమ్ సాగర్, ఎల్లబెల్లి మూర్తి , లడ్డు రాకేష్, ఇందాస్, చరణ్, గాజుల చంద్ర కిరణ్, గోనే రాజేందర్ , పట్టణ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాపాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.