Thursday, 5 November 2026

ప్రమాదం స్థలానికి ఆలస్యంగా వచ్చిన 108 వాహనం.

అత్యవసర పరిస్థితులలో స్పందించని జిల్లా అధికారులు..

జిల్లా వైద్య అధికారికి సమాచారం తెలియజేద్దాం అంటే చరవాణి లో స్పందించలేదు…

ములుగు జిల్లా బ్యూరో, ఫిబ్రవరి16(జనంసాక్షి):

108 డ్రైవర్​ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ప్రమాదం జరిగిన సంఘటన ఒక్క జిల్లా ఫారెస్ట్ సూపర్డెంట్ ఉద్యోగి జీవితాన్ని చిదిమేసింది.భద్రాచలం దర్శనం చేసుకొని వస్తున్న కారు టిఎస్03ఈవి0808 అదుపుతప్పి చెట్టుకు గుద్దుకుంది.ఘటనలో మహబూబాబాద్ కు చెందిన ఫారెస్ట్ సూపర్డెంట్ ఆఫీసర్ సిరికొండ కృష్ణమాచారి (వయసు 54)తలకు బలమైన గాయాలు తగిలి మృత్యువాత పడ్డాడు. ఈ క్రమంలో కృష్ణమాచారి భార్య సిరికొండ కళావతి(వయసు 50) కి బలంగా గాయపడింది.ఈ ప్రమాదం మంగపేట మండలం బ్రాహ్మణపల్లి,దుగినేపల్లి ససరిహద్దు వద్ద చోటు చేసుకుంది.వీరు హన్మకొండకు చెందినవారని సమాచారం తెలిసింది.సమాచారం అందిన వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్న మంగపేట ఎస్ఐ.ప్రమాద బాధితురాలు వైైద్యము రామచంద్ర అని మొత్తుకుంటున్నా అందుబాటులో లేని అంబులెన్సు. ఈ దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది. ప్రమాద స్థలికి చేరుకున్న పలువురు ప్రజలు ప్రమాదం జరిగింది అటవీీ శాఖకు చెందిన ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి కి అని తెలుసుకొని జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించాలనే ఉద్దేశంతో చరవాణిలో సంప్రదించాలని ప్రయత్నించిన ఎవరు స్పందించకపోవడంతో అధికారుల తీరుపై ప్రజలు ఆహస్యంచుకుంటున్నారు.