Thursday, 5 November 2026

ప్రమాదవశాత్తు బావిలో పడిన కారు..

ప్రమాదవశాత్తు బావిలో పడిన కారు..

నలుగురు మృతి,ముగ్గురు సురక్షితం

వివరాలు వెల్లడించిన ఎస్సై రమేష్ బాబు

కేసముద్రం అక్టోబర్ 28 జనం సాక్షి/శుక్రవారం రోజున సాయంత్రం కేసముద్రం పట్టణ బైపాస్ రోడ్డు శివారులో ప్రమాదవశాత్తు కారు బావిలోకి దూసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది.స్థానిక ఎస్సై రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం…వరంగల్ అన్నారం షరీఫ్ దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు,ముగ్గురు సురక్షితమని తెలిపారు.మృతుల స్వస్థలం టేకులపల్లి అని తెలియజేశారు.విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై రమేష్ బాబు ,పోలీస్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని జెసిపి తో,స్థానికుల సహాయంతో కారును బయటకు తీసే ప్రయత్నం కొనసాగించి ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.