అబ్దుల్లాపూర్ మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ శివారు పెద్ద అంబర్‌పేట్ నగర పంచాయతీ కూడలి సమీపంలోని డాగ్‌బంగ్లా ప్రాంతంలో అగి ఉన్న లారీని వెనక నుంచి వస్తున్న శాంత్రో కారు ఢీకొట్టింది. ఈప్రమాదంలో లారీ కిందకు కారు దూసుకుపోగా కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం హయత్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన ముగ్గురు నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం సంఘ్యం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.




