Wednesday, 4 November 2026

ప్రమాదాల నివారణకై లేజర్ స్పీడ్ గన్ ఏర్పాటు : ఎస్ ఐ కే జగదీష్

దంతాలపల్లి ఆగస్ట్ 20 జనంసాక్షి

అతివేగం వలన జరిగే ప్రమాదాల నివారణకే లేజర్ స్పీడ్ గన్ ఏర్పాటు చేసినట్లు స్థానిక ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు .శనివారం మండల కేంద్రంలోని వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి (563) పై లేజర్ స్పీడ్ గన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్పీడ్ లేజర్ గన్ ద్వారా అతివేగంగా వెళ్లే వాహనాల ఫోటోలు తీసి చలానాలు వేయనున్నట్లు తెలిపారు. వాహనదారులు జరిమానాలు విధిస్తారనే భయంతో కాకుండా ప్రమాదాలు జరగకుండా బాధ్యతగావ్యవహరించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది నాంపల్లి రాజేష్, మధు తదితరులు పాల్గొన్నారు.