హైదరాబాద్,మే2( జనం సాక్షి): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోమారు భారీగా బంగారం పట్టుబడింది. ఓ ప్రయాణికుడి నుంచి బంగారం బిస్కట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం బంగారం బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. జెడ్డా నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 799 గ్రాముల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ. 25లక్షలు ఉంటుందన్నారు. అతడిని క్షుణ్ణంగా పరిశీలిస్తుండగా ఇవి దొరికాయని అన్నారు. కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




