గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్ష పూర్తి చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి సూచించారు. ఈ నెల 11, 13 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థులకు ఆయన కొన్ని సూచనలు చేశారు. పరీక్ష సందర్భంగా వ్యవహరించాల్సిన తీరుపై జాగ్రత్తలు చెప్పారు. ఎలాంటి సందేహాలు వచ్చినా అభ్యర్థులు 040-24655555, 040-24696666, 7288896611 హెల్ప్‌డెస్క్ నంబర్లలో సహాయం పొందవచ్చని వివరించారు. మొదటి పరీక్ష రాయలేకపోతే తదుపరి పరీక్షలకు హాజరయ్యే అవకాశం కోల్పోతారు కనుక పరీక్షా కేంద్రాల విషయంలో గందరగోళానికి గురికావద్దని చెప్పారు. ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించిన చక్రపాణి.
ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్షలు




