Wednesday, 4 November 2026

ప్రహరీ కూలి ఇద్దరు కార్మికులు మృతి

అంబర్‌పేట( జ‌నం సాక్షి): నగరంలోని అంబర్‌పేట పటేల్‌ నగర్‌లో నేడు ప్రహరీ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. సెల్లార్‌ కోసం తవ్విన ఓ గుంతలో వీరు పనులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సెల్లార్‌ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ అనుమతి లేదని తర్వాత అధికారులు గుర్తించారు. దీంతో టౌన్‌ప్లానింగ్‌ అధికారులపై చర్యలు తీసుకుంటానని జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ ప్రకటించారు. అనుమతి లేకుండా పనులు చేయిస్తున్న స్థల యజమాని రమేష్‌ గుప్తాను అరెస్టు చేశారు.